స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా.. పార్టీల రియాక్షన్ ఇదే..

స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా.. పార్టీల రియాక్షన్ ఇదే..

స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించిన సమావేశం ముగిసింది. పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో నోటా పై అభిప్రాయం చెప్పాలని పార్టీలను ఈసీ కోరింది. దీనిపై అధికార కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాతో ఎన్నికలను నిర్వహించడాన్ని అధికార కాంగ్రెస్ వ్యతిరేకించింది. నోటాతో ఎన్నిక అనేది ఖర్చు ఎక్కువ అని అభిప్రాయపడింది. ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించినా  సెకండ్ లార్జెస్ట్ పార్టీ గెలిచినట్లుగా ప్రకటించాలని సూచించింది. 

ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నోటా తో ఎన్నికలను సమర్థించింది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేసేందుకు బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని ఈసీకి తెలిపింది. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ఈసీని కోరింది బీఆర్ఎస్.

 

Also Read :- పని చేయాలంటే ఇష్టపడట్లే.. ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

 

సుప్రీంకోర్టు లో కేసు ఉన్నందున నోటాపై  అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని బీజేపీ తెలిపింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని అభిప్రాయపడింది. పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని సూచించింది.  

నోటా తో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని సీపీఎం పార్టీ తెలిపింది. అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ ఎలక్షన్ కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. ఎన్నిక కండక్ట్ చేయడ ముఖ్యమని.. నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనేది తర్వాత చర్చ అని తెలిపింది. 

ఇట టీ-టీడీపీ తమ అభిప్రాయాన్ని రెండు మూడు రోజుల్లో చెప్తామని తెలుపగా.. పోటీలో సింగిల్ క్యాండిడేట్ ఉన్న కూడా నోటా ఉండాలని జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని ఈసీకి తెలిపింది.