లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రెటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తర ప్రదే శ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా మిజోరాం, హిమాచల్ ప్రదేశ్ లోని సాధరాణ పరిపాలన విభాగం కార్యదర్శిని కూడా తొలగించారు. పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని తొలగించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తో పాటు పలువురు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఈసీఐ తొలగించింది. వీరితోపాటు మిజోరాం, హిమాచల్ ప్రదేశ్ లోని జీఏడీ కార్యదర్శులు, ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తోంది.