పంచాయితీ ఎన్నికలు: ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ..

పంచాయితీ ఎన్నికలు: ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ..
  • పంచాయతీల్లో 1,67,33,584 ఓటర్లు
  • తుది జాబితా విడుదల చేసిన ఈసీ
  • 12,867 పంచాయతీల్లో 1,13,722 వార్డులు
  • 82,04,518 పురుషులు, 85,28,573 మహిళలు, 493 ఇతరులు
  • స్థానిక పోరుకు ఎన్నికల కమిషన్ సంసిద్ధత 

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో  12,867 పంచాయతీల్లో 1,67,33,584  మంది ఓటర్లున్నట్టు తెలిపింది. ఇందులో  82,04,518 పురుషులు, 85,28,573 మహిళలు, 493 ఇతరులు ఉన్నారని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కన్నా మహిళలే అత్యధికంగా ఉన్నట్టు ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం వార్డులు, పంచాయతీల రిజర్వేషన్‌ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. 

రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తేనే ఎన్నికల నిర్వహణకు అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది. కులగణన పూర్తి చేసిన తరువాతే రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో కులగణన పూర్తయి, రిజర్వేషన్లు ఖరారయ్యాకే ఎన్నికలు జరగనున్నాయి.

ALSO READ | Indian Economy Special : ఎన్నికల కమిషనర్​ ఏర్పాటు : ఇండియన్ ఎకానమీ స్పెషల్