మహారాష్ట్రలో కోడ్ ఉల్లంఘనపై 6,382 ఫిర్యాదులు

మహారాష్ట్రలో కోడ్ ఉల్లంఘనపై 6,382 ఫిర్యాదులు

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన డేటాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలో అక్టోబర్‌‌ 15 నుంచి మోడల్‌‌ కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్‌‌ (ఎంసీసీ) అమల్లోకి వచ్చిందని గుర్తుచేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మోడల్ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి తమకు 6,382 ఫిర్యాదులు అందాయని ఈసీ తెలిపింది.ఈ ఫిర్యాదుల్లో  ఒకటి మినహా అన్నింటినీ పరిష్కరించామని వెల్లడించింది.

ఈ ఫిర్యాదులు పోల్‌‌ ప్యానెల్‌‌కు చెందిన సీవిజిల్ యాప్‌‌ ద్వారా దాఖలయ్యాయని పేర్కొంది. అలాగే..తమ ఆధ్వర్యంలోని వివిధ రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిసి  రూ.536.45 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని చెప్పింది. సీజ్ చేసిన వాటిలో  నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన ఆభరణాలు ఉన్నాయని వివరించింది.