ఏపీలో ఉత్కంఠ రేపిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు అంతా ఫలితాల కోసం అందరు అంతకు మించిన ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ పై చంద్రబాబు ఈసీకి రాసిన లేఖపై సానుకూలంగా స్పందించింది ఎన్నికల సంఘం. ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ వల్ల కీలకమైన ఫైల్స్ మిస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వాయిదా వేయాలని చంద్రబాబు లేఖ రాశారు.
చంద్రబాబు లేఖపై సానుకూలంగా స్పందించిన ఈసీ ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. విపక్షాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి దీన్ని వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెర్షన్ తోనే ఈ-ఆఫీస్ ను కొనసాగించాలని సూచించారు. దీంతో ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ చేసే ప్రక్రియను వాయిదా వేయాలని ఎన్ఐసీ నిర్ణయించింది. ఈసీ నిర్ణయంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.