జీపీ ఎన్నికలకు ఓటర్ లిస్ట్ వచ్చేసింది

జీపీ ఎన్నికలకు ఓటర్ లిస్ట్ వచ్చేసింది
  •  ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేయనున్నఈసీ 
  •  త్వరలో ఓటర్ లిస్ట్ పై నోటిఫికేషన్

 హైదరాబాద్ వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్ని కలపై కీలక అడుగు ముందుకు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు రోజుల క్రితం కొత్త ఓటర్ లిస్ట్ వచ్చిందని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ లిస్టును రాష్ట్ర ఎన్నికల సంఘం టీ పోల్ యాప్ లో అప్ లోడ్ చేయనుంది. లోక్ సభ ఎన్నికల టైంలో కన్నా ఓటర్లు కొద్దిగా పె రిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 25 నాటికి రాష్ట్రంలో 3,32,32,318 కోట్ల ఓటర్లు ఉండగా కొద్దిగా పెరిగారు. కాగా,ఓటర్ లిస్ట్ను ఈసీత్వరలో వెల్లడించనుంది. తరువాత వారం పాటు అభ్యంతరా లు స్వీకరించి వాటిని పరిశీలించనున్నారు. 

ఇది వరకే జిల్లా కలెక్టర్లు పంపిన ట్రైనింగ్ అఫ్ ట్రైనర్కు ఈసీ హైదరాబాద్ లో రెండు రోజులు శిక్షణ ఇచ్చింది. జిల్లాల్లో కూడా ఓటరు జాబితా రూపకల్పనపై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇక. 2019లో గ్రామ పంచాయతీ ఎన్నికల టైమ్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించగా ఈసారి ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందరినీ హైదరాబాద్ రమ్మనడం కన్నా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి ఓటింగ్ కు పరిస్థి తులు ఎలా ఉన్నాయోజిల్లాల్లో పర్యటిస్తే వాస్తవ పరిస్తే తులు తెలుస్తాయని ఈసీ అధికారులు చెబుతున్నారు. కాగా, వచ్చే నెలలో జిల్లాల్లో ఎన్నికల సంఘం కమిష 

బీసీ కమిషనకు ఓటర్ లిస్ట్ 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలక అంశం అయిన బీసీ రిజర్వేషన్ల పెంపుపై కులగణన లేదా ఓటర్ బిస్ట్ ప్రకారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా జనాభాను విభజించి విజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కుల గణనపై ఉత్తర్వులు ఇస్తామని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కులగణన ద్వారానే రిజర్వేషన్లు పెంచాల్సి ఉన్నందున కులగణనకే సర్కారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 31న బీసీ కమిషన్ కాలపరిమితి ముగియనుందన కొత్త కమిషన్ ను అంతకుముందే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

బీసీ కమిషన్ చైర్మన్ రేసులో మాజీ ఎంపి వి హనుమంతరావుతో పాటు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గోపిశెట్టి నిరంజన్ పేర్లు వినపడుతున్నాయి. చైర్మన్ తో పాటు మరో ముగ్గురు మెంబర్లను ప్రభుత్వం నియమించనుంది < > సర్ పార్థసారథి, సెక్రటరీ అశోక్ కుమార్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల సిబ్బంది, పోలీసు సిబ్బంది తక్కువ ఉన్నందున మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరిపేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. 

మరోవైపు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు పై ప భుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. వీటికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఎన్నికల నిర్వహణకు ఇతర శాఖలకు చెందిన సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఈసీ కోరనుంది. బ్యాలట్ పేపర్లు రెడీగా ఉండగా, ఎన్నికల ముందు నెల రోజులు ప్రాసెస్ ఉంటుందని, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అక్టోబరులో జీపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.