ECB: విదేశీ లీగ్‌లు ఆడేందుకు నో ఛాన్స్.. ఇంగ్లాండ్ ప్లేయర్లకు బోర్డు కఠిన నిర్ణయం

ECB: విదేశీ లీగ్‌లు ఆడేందుకు నో ఛాన్స్.. ఇంగ్లాండ్ ప్లేయర్లకు బోర్డు కఠిన నిర్ణయం

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. నివేదికల ప్రకారం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో ఆడకుండా ఇంగ్లీష్ ఆటగాళ్లపై పరిమితులను విధించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆటగాళ్లు ఫ్రాంచైజీ లీగ్ ల మాయలో పడి ఇంగ్లాండ్ క్రికెట్ ను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

మెజారిటీ ఆటగాళ్లు డొమెస్టిక్ సర్క్యూట్ కంటే ఓవర్సీస్ లీగ్‌లకు ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఈ విషయంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కఠినంగా ఉండాలని యోచిస్తోంది. దేశవాళీ సీజన్‌లో ఆటగాళ్లు ఇతర క్రికెట్ ఆడకుండా ఉండే రూల్స్ తీసుకురావాలని వారు ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ తో దేశవాళీ టీ20 క్రికెట్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 7 నుండి మే 20 వరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ జరగనుంది. గత సీజన్ లో 16 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ లీగ్ లో ఆడారు. 

Also Read :- డబుల్ సెంచరీతో దంచి కొట్టిన సర్ఫరాజ్

ఈ సంవత్సరం మేజర్ లీగ్ క్రికెట్, గ్లోబల్ T20 కెనడా , కరేబియన్ ప్రీమియర్ లీగ్, జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ లలో ఇంగ్లాండ్ క్రికెటర్లు బిజీగా మారిపోయారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు దేశీయ ఆటను ఎలా కాపాడుకోవాలనే దానిపై మార్గాలను అన్వేషిస్తోంది. ఇండియాలో జరిగే ఐపీఎల్ కు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం.