England cricket: తప్పుకున్న మాథ్యూ మోట్.. ట్రెస్కోథిక్‌ చేతికి ఇంగ్లండ్ జట్టు బాధ్యతలు

England cricket: తప్పుకున్న మాథ్యూ మోట్.. ట్రెస్కోథిక్‌ చేతికి ఇంగ్లండ్ జట్టు బాధ్యతలు

ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి మాథ్యూ మోట్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ ధ్రువీకరించింది. అతని స్థానంలో తాత్కాలిక కోచ్‌గా ఆ జట్టు మాజీ క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్‌ను నియమించింది. 

కోచ్‌‌గా మాథ్యూ మోట్ పదవీ కాలం నాలుగేళ్లు కాగా, సగం దారిలోనే తప్పుకున్నాడు. 2022 మేలో బాధత్యలు చేపట్టిన మోట్.. కేవలం రెండున్నరేళ్లకే గుడ్ బై చెప్పాడు. గతేడాది భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన, ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ టైటిల్ ను నిలబెట్టుకోలేకపోవడం వంటి ఘటనలు అతను పదవి నుంచి తప్పించాయి. 

గర్వపడుతున్నా.. మోట్

ఇంగ్లండ్ పురుషుల జట్టుకు కోచ్‌గా పనిచేసినందుకు గర్వపడుతున్నానని మోట్ అన్నారు. ఇది తనకు దక్కిన ఒక గౌరవంగ భావిస్తానని తెలిపారు. ఇన్నాళ్లు తనకు సహకరించిన ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్, ఇసిబిలోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ : Champions Trophy 2025: మీ భద్రతకు నాది భరోసా.. మా దేశం వచ్చి ఆడండి: పాకిస్థాన్ మాజీ పేసర్

మోట్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌లపై వైట్-బాల్ సిరీస్ విజయాలను అందుకుంది.