మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 288 శాసనసభ్యులు గల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం(అక్టోబర్ 15) ప్రకటించింది. ఎన్నికల వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. మహారాష్ట్ర అసెంబ్లీకి సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా.. 23న కౌంటింగ్ చేపట్టనున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్
- నోటిఫికేషన్ వెలువడు తేదీ: 22/10/ 2024
- నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 29/10/ 2024
- నామినేషన్ల పరిశీలన: 30/10/ 2024
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 04/11/ 2024
- పోలింగ్ జరుగు తేదీ: 20/11/ 2024
- కౌంటింగ్ తేదీ: 23/11/ 2024
- మహారాష్ట్ర: 288 అసెంబ్లీ సీట్లు(జనరల్-234, ఎస్సీ-29, ఎస్టీ- 25)
- మొత్తం ఓటర్ల సంఖ్య: 9 కోట్ల 63 లక్షలు
- పురుష ఓటర్లు: 4 కోట్ల 97 లక్షలు
- మహిళా ఓటర్లు: 4 కోట్ల 66 లక్షలు
- యువత: 1.86 కోట్లు
- తొలిసారి ఓటు హక్కు: 20.93లక్షలు
- మొత్తం పోలింగ్ స్టేషన్లు: లక్షా 186
- ఒక్కో పోలింగ్ బూతుకు 960 మంది ఓటర్లు
- మోడల్ పోలింగ్ స్టేషన్ 530
కాగా, 288 మంది శాసనసభ్యులు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబరు 26తో ముగియనుంది.