ECMS: ఎలక్ట్రానిక్స్ తయారీకి రూ.22,919 కోట్లతో స్కీమ్‌‌... డైరక్ట్​గా 91 వేల 600 జాబ్స్​

ECMS: ఎలక్ట్రానిక్స్ తయారీకి రూ.22,919 కోట్లతో స్కీమ్‌‌... డైరక్ట్​గా 91 వేల 600 జాబ్స్​

న్యూఢిల్లీ:  ఇండియాను ఎలక్ట్రానిక్స్ తయారీకి హబ్‌‌గా మార్చేందుకు ప్రభుత్వం  రూ. 22,919 కోట్లతో  ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్‌‌)ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌‌తో  రూ. 59,350 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని,  రూ. 4,56,500 కోట్ల విలువైన ఉత్పత్తుల తయారీని  సాధించాలని,  91,600 మందికి  డైరెక్ట్‌‌గా జాబ్స్ ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకుంది.  కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఢిల్లీలో  ఈసీఎంఎస్‌‌  స్కీమ్‌‌,  మార్గదర్శకాలను, పోర్టల్‌‌ను శనివారం విడుదల చేశారు.   భారతదేశ విధానాలను దేశీయ,  గ్లోబల్ ప్లాట్‌‌ఫామ్‌‌లలో చురుకుగా ప్రచారం చేస్తామని, పెట్టుబడులను ఆకర్షించడంలో పనిచేస్తామని సెమీ ఇండియా అధ్యక్షుడు అశోక్ చందన్‌‌ అన్నారు.