వరల్డ్ ఫేమస్ చెట్లతో ఎకో పార్క్ ఆకట్టుకుంటోంది : సినీ నటుడు చిరంజీవి

వరల్డ్ ఫేమస్ చెట్లతో ఎకో పార్క్ ఆకట్టుకుంటోంది : సినీ నటుడు చిరంజీవి

చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో వరల్డ్ క్లాస్ ఎక్స్ పీరియం ఎకో పార్క్ ను మంగళవారం (జనవరి 28) ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి పరిధిలోని పొద్దుటూరులో ఉంది. 150 ఎకరాల విస్తీర్ణంలో ఎకో పార్క్  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25వేల జాతుల మొక్కలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, సినీ నటుడు చిరంజీవి, ఎంపీ సీఎం రమేష్,వనజీవి రామయ్య దంపతులు  లు పాల్గొన్నారు. 

ఎకో ఎక్స్ పీరియం పార్కు ప్రారంభోత్సవంలో నటులు చిరంజీవి మాట్లాడుతూ..పార్కును అద్భుతంగా తీర్చిదిద్దారు.. మంచి టూరిజం స్పాట్ అవుతుంది.. వెడ్డింగ్స్, ఈవెంట్స్ కి అద్భుతంగా ఉంటుందన్నారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన చెట్లు బాగా ఆకట్టుకున్నాయన్నారు. ముఖ్యంగా వివిధ దేశాలనుంచి తెప్పించిన అద్బుత కళాఖండాలతో ఈ పార్క్ ను తీర్చిదిద్దారు. 

ALSO READ | గతంలో కూల్చినా మళ్లీ అక్రమ నిర్మాణాలు.. కుత్బుల్లాపూర్లో హైడ్రా కూల్చివేతలు