కనకగిరి కొండలలో​​​​​​​ ఎకో టూరిజం పనుల పరిశీలన 

కనకగిరి కొండలలో​​​​​​​ ఎకో టూరిజం పనుల పరిశీలన 

పెనుబల్లి, వెలుగు  : కనకగిరి కొండలలో ఎకో టూరిజం పనులను రాష్ట్ర అటవీశాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. పెనుబల్లి మండలం కనకగిరి అడవి ప్రాంతం లో ఉన్న పులిగుండాల ప్రాజెక్ట్ తో పాటు చంద్రుగొండ మండలం లో ఉన్న హస్తాల వీరన్న గుట్ట, లేపార్డ్ టవర్ ప్రాంతాలలో ఎకో టూరిజం పనులను  సువర్ణ, సిసి యఫ్ భీమా నాయక్ లు ఖమ్మం డియఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి పరిశీలించారు.

అటవీ ప్రాంతంలో జంతువులకు ఎలాంటి ఆటంకం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలనీ అడవిని ప్లాస్టిక్ రహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వన దర్శినిలో భాగంగా విద్యార్థులతో కలిసి అడవిలో పర్యటించి జంతువులు పక్షులు చెట్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి యఫ్ డిఓ మంజుల, యఫ్ ఆర్ ఓ ఉమా, రామ్ సింగ్ భరత్ పాల్గొన్నారు.