మాధవ్​ గాడ్గిల్​కు యూఎన్​ఓ చాంపియన్స్​ ఆఫ్​ ఎర్త్​ అవార్డ్​

మాధవ్​ గాడ్గిల్​కు యూఎన్​ఓ చాంపియన్స్​ ఆఫ్​ ఎర్త్​ అవార్డ్​

ప్రముఖ జీవావరణవేత్త మాధవ్​ గాడ్గిల్​ పశ్చిమ కనుమల్లో జీవవైవిధ్య సంరక్షణకు చేసిన కృషికిగాను ఐక్యరాజ్య సమితి చాంపియన్స్​ ఆఫ్​ ఎర్త్​ అవార్డును ప్రకటించింది.

ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్​ఈపీ) ఆధ్వర్యంలో యూఎన్​ఓ ప్రతి సంవత్సరం పర్యావరణ రంగంలో ప్రకటించే అవార్డుల్లో చాంపియన్స్​ ఆఫ్​ ఎర్త్​ అవార్డు అత్యున్నతమైంది. ఈ  అవార్డును 2005లో స్థాపించారు. ఈ ఏడాది చాంపియన్స్​ ఆఫ్​ ఎర్త్​ అవార్డ్​ పొందిన ఏకైక భారతీయుడు గాడ్గిల్​ మాత్రమే. 

అవార్డు అందుకున్న భారతీయులు

డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మన్​ (2002): ప్రముఖ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణులను సంరక్షించడంలో చేసిన కృషికిగాను ఈ అవార్డు అందుకున్నారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ: పర్యావరణానికి ముప్పు కలిగించే ఒకేసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్​ నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టినందుకు, ఇంటర్నేషనల్​ సోలార్​ అలయన్స్​ను ఏర్పాటు చేసినందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన వివిధ కార్యక్రమాలకుగాను ఈ అవార్డును 2018లో నరేంద్ర మోదీకి ప్రకటించారు. 

మాధవ్​ గాడ్గిల్​ రిపోర్ట్​

మాధవన్​ గాడ్గిల్​ నేతృత్వంలో 14 మంది సభ్యులతో 2010, మార్చిలో ఆనాటి కేంద్ర పర్యావరణ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. జీవావరణానికి, అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతులకు ఆలవాలమైన పశ్చిమ కనుమలను, పర్యావరణపరంగా ఎకలాజికల్లీ సెన్సిటివ్​ అయిన పశ్చిమ కనుమలను మూడు జోన్లుగా విభజించాలంటూ 2011, ఆగస్టు 31న నివేదికను ఇచ్చింది.