50 వేల మందిని తీసుకోనున్న ఈకామ్​ ఎక్స్​ప్రెస్​

50 వేల మందిని తీసుకోనున్న ఈకామ్​ ఎక్స్​ప్రెస్​

ముంబై : లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ ఈకామ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ తన ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ ప్రోగ్రామ్ 'ఈ–కామ్ సంజీవ్' కింద ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 50 వేల మందికి పైగా డెలివరీ పార్ట్​నర్లను తీసుకుంటామని సోమవారం ప్రకటించింది.  పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఆన్​లైన్​ షాపింగ్​ ఆర్డర్ డెలివరీలు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లాస్ట్​ మైలు సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. పోయిన సంవత్సరం ప్రారంభించిన 'ఈ–కామ్ సంజీవ్' కార్యక్రమం కింద విద్యార్థులను, గృహిణులను, ఫ్రీలాన్సర్లను  డెలివరీ పార్ట్​నర్లుగా తీసుకున్నామని ఈకామ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ తెలిపింది.

"ఈ కామర్స్ ఆర్డర్ డెలివరీల విషయంలో కస్టమర్‌‌‌‌‌‌‌‌లు చాలా వేగంగా సేవలను ఆశిస్తున్నారు. పరిశ్రమలలో గ్రోత్​ కారణంగా పార్శిళ్ల సంఖ్య నిరంతరం పెరుగుతున్నది. మా డెలివరీ సిస్టమ్​ను బలోపేతం చేయడానికి భారీగా గిగ్ వర్కర్లు అవసరం.  పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌లో కస్టమర్ల నుంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఊహించినంత పెరుగుతుందని అనుకుంటున్నాం” అని ఈకామ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఆశిష్ సిక్కా అన్నారు. కంపెనీ తన డెలివరీ పార్టనర్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను విస్తరించడాన్ని కొనసాగిస్తుందని,  ఈ ప్రోగ్రామ్ ద్వారా డెలివరీ పార్ట్​నర్లకు సంపాదించే అవకాశాలను ఇవ్వడంతోపాటు వారికి అదనపు ప్రయోజనాలను అందజేస్తామని ఆయన చెప్పారు.