దేశమంతటా ఈ–కామర్స్ ​ఎగుమతి హబ్స్​

  • 1,015 హబ్​ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు 
  • పరిశ్రమ నుంచి అభిప్రాయాలు కోరిన అధికారులు

న్యూఢిల్లీ: ఈ–కామర్స్​రంగానికి మరింత చేయూతను ఇవ్వడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ–కామర్స్​ ఎగుమతి హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను (ఈసీఈహెచ్) ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పరిశ్రమ నుంచి ప్రతిపాదనలను కోరింది. ఇబ్బందులు లేని, వేగవంతమైన ఎగుమతి అనుమతులను జారీ చేస్తామని తెలిపింది. ఈసీఈహెచ్ కోసం సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ అవసరాలతో సహా మరెన్నో అందుబాటులోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్​టీ) ట్రేడ్ నోటీసులో తెలిపింది. 

ఈ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా విధివిధానాలను రూపొందించినట్లు పేర్కొంది.  ప్రతిపాదించిన ముసాయిదా పద్ధతుల ఆధారంగా, ప్రభుత్వం కొన్ని ఈసీఈహెచ్​లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అనుకుంటోంది.   ప్రభుత్వ–-ప్రైవేట్-భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఈ–కామర్స్​ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడానికి ఈ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం ప్రకటించింది. తొలుత దేశంలో 1,0-15 హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.  ఈ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సరిహద్దు ఈ–కామర్స్​ కార్యకలాపాల కోసం కేంద్రంగా పనిచేస్తాయి. 

ఇవీ లక్ష్యాలు..

ఈ–కామర్స్​ ఎగుమతుల కోసం త్వరగా అనుమతులు జారీ చేయడం, ఈ–కామర్స్​ రిటర్న్స్ లేదా తిరస్కరణల కోసం సులభంగా తిరిగి దిగుమతి చేసుకోవడం, వివిధ సరిహద్దు ఈ–కామర్స్​ వాటాదారులను ఒకే చోటకు  తీసుకురావడానికి ఇలాంటి హబ్​లను ఏర్పాటు చేస్తున్నారు.   ప్రస్తుతం ఈ–కామర్స్​ ద్వారా భారతదేశం చేసే ఎగుమతులు ఐదు బిలియన్​ డాలర్లు మించడం లేదు. ఏటా చైనా 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతులు చేస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఎగుమతులను 50-–100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే అవకాశం ఉందని కేంద్రం చెబుతున్నది. 

ఈసీఈహెచ్​లో​ రెండు భాగాలు ఉంటాయి. మొదటిది ఫుల్​ఫిల్​మెంట్​ ఏరియా. ఇందులోని ప్యాకింగ్, లేబుల్ చేయడం, నిల్వ చేయడం వంటి పనులు జరుగుతాయి. రెండవది కస్టమ్స్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కొనుగోలుదారుడు దొరికిన తరువాత ఇక్కడి వస్తువులకు  కస్టమ్స్ క్లియర్ వస్తుంది. రవాణాకు సిద్ధంగా ఉంటాయి.  ఈ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా చిన్న ఉత్పత్తిదారులు అగ్రిగేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అమ్ముకోవచ్చు. హబ్​లలో వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌసింగ్ సౌకర్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, రిటర్న్స్ ప్రాసెసింగ్, లేబులింగ్, టెస్టింగ్  రీప్యాకేజింగ్ కూడా ఉంటాయి.