- రెండోస్థానంలో ఛత్తీస్గఢ్మూడోస్థానంలో తెలంగాణ
ముంబై: మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నట్టు వెల్లడయింది. పేద రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్‌గఢ్ కూడా ఆర్థికంగా ఎదుగుతోంది. ‘ఓవరాల్ ఫిస్కల్ హెల్త్‌కార్డ్’లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, ఇది రెండోస్థానం సంపాదించింది. తెలంగాణ మూడోస్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో బెంగాల్, పంజాబ్, కేరళ ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి బడ్జెట్ అంచనాల ఆధారంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, బెంగాల్, పంజాబ్ కేరళలకు ఈ ర్యాంకులు ఇచ్చారు. డాయిష్ బ్యాంక్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ దాస్17 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యంపై రిపోర్ట్ తయారు చేశారు. దీని ప్రకారం...2023 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాల ఆధారంగా, మహారాష్ట్ర ర్యాంకింగ్‌లో మొదటిస్థానంలో ఉండగా, చత్తీస్‌గఢ్, ఒడిస్సా, తెలంగాణ, జార్ఖండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బెంగాల్ పరిస్థితి అధ్వానంగా ఉంది.
‘వరస్ట్ ఫైవ్’ అనే ముద్ర నుంచి పంజాబ్, బీహార్, రాజస్థాన్, యూపీ, కేరళ బయటపడ్డాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిదో స్థానంలో ఉన్న ఆంధ్రా ర్యాంకింగ్ 2023 ఆర్థిక సంవత్సరంలోలో 11వ స్థానానికి పడిపోయింది, గుజరాత్ ఐదో ర్యాంక్ నుంచి ఏడో ర్యాంక్‌కు దిగజారింది. సవరించిన 2022 ఆర్థిక సంవత్సర వాస్తవ బడ్జెట్ డేటా ప్రకారం... మహారాష్ట్ర, ఒడిస్సా, జార్ఖండ్, గుజరాత్ తర్వాత ఛత్తీస్‌గఢ్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ అత్యంత అధ్వాన్నంగా ఉంది. బెంగాల్, కేరళ, రాజస్థాన్ బీహార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -ఆర్థిక లోటు, సొంత పన్ను రాబడి, అప్పులు, జీఎస్డీపీ వంటి పరామితుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.
వీటి ఆధారంగా చూస్తే పంజాబ్, బెంగాల్, బీహార్, రాజస్థాన్, కేరళ ఆర్థిక పరిస్థితి కరోనాకు ముందు, తరువాత కూడా బలహీనంగానే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఛత్తీస్‌గఢ్‌లు 2004 నుంచి 2016 ఆర్థిక సంవత్సరాలలో టాప్లోలో ఉన్నట్లు చూపిస్తోంది. వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ రంగ రుణ పునర్నిర్మాణం, కరోనా షాక్ వంటివి ఈ రాష్ట్రాలలో కొన్నింటి ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వీటి కారణంగా రాష్ట్రాల ఆదాయంలో అధిక భాగం అప్పులకే వెళ్తున్నది.