ఆర్థిక సర్వేలో షాకింగ్ : డిగ్రీ చదివిన ప్రతి ఇద్దరిలో ఒకరు ఉద్యోగానికి పనికి రారు

ఆర్థిక సర్వేలో షాకింగ్ : డిగ్రీ చదివిన ప్రతి ఇద్దరిలో ఒకరు ఉద్యోగానికి పనికి రారు

డిగ్రీ పట్టా వచ్చిందని పార్టీలు చేసుకోవటం.. డిగ్రీ కంప్లీంట్ అయ్యిందని కాలర్ ఎగరేసుకోవటం తప్పితే.. ఆ డిగ్రీ పట్టాతో ఉద్యోగం చేసే సత్తా మాత్రం నేటి యువతలో లేదంట.. ఈ మాట మేం కాదు అంటున్నది.. 2024 ఆర్థిక సర్వే లెక్కలు.. అవును భారతదేశంలో డిగ్రీ పట్టా ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరు ఉద్యోగానికి అన్ ఫిట్.. ఉద్యోగం చేసే సామర్థ్యం.. తెలివి తేటలు లేవంట.. అసలు స్కిల్ లేదంట.. ఉద్యోగానికి అర్హత కూడా సాధించటం లేదని ఆర్థిక సర్వే చెబుతోంది.. డిగ్రీ చదివినా ఉద్యోగానికి పని రావటం లేదంటే.. మరి 16 సంవత్సరాలపాటు వీళ్లు ఏం చదవినట్లు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్.. డిగ్రీ చదవిన కుర్రోళ్లపై ఆర్థిక సర్వే ఏం చెప్పిందో వివరంగా చూద్దామా..

2024 ఆర్థిక సర్వే ప్రకారం మన దేశ జనాభాలో 65శాతం మంది 35ఏళ్ళ వయసు లోపు వారే అని, వీరిలో ఎక్కువమందికి నేటి ఆర్థిక వ్యవస్థకు అవసరమయ్యే స్కిల్స్ లేవని తేలింది.ఆర్థిక సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం యువతలో 51శాతం మందికి మాత్రమే ఉద్యోగం సాధించే అర్హతలు ఉన్నాయని తేలింది. క్లుప్తంగా చెప్పాలంటే డిగ్రీ పట్టా సాధించిన ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఉద్యోగానికి పనికిరారని ఆర్థిక చెబుతోంది.అయితే, గత పదేళ్లలో ఉద్యోగానికి అర్హులయ్యే వారి సంఖ్య 34శాతం నుండి 51శాతానికి పెరిగిందని తెలుస్తోంది.

ఉపాధి, నైపుణ్యాభివృద్ధి: 

ఇండియన్ లేబర్ మార్కెట్ ఇండికేటర్స్ ప్రకారం గత ఆరేళ్లలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిందని తెలుస్తోంది.

EPFO కింద నెట్ పేరోల్ జోడింపులు గత ఐదేళ్లలో రెండింతలు కంటే ఎక్కువగా పెరిగాయని తెలుస్తోంది, ఇది ఫార్మల్ ఎంప్లాయిమెంట్లో హెల్దీ గ్రోత్ కి సంకేతంగా చెప్పచ్చు.

15 నుండి 29ఏళ్ళ వయసువారిలో 2017, 18లో 17.8 శాతంగా ఉన్న నిరుద్యోగిత 2022, 23నాటికి 10శాతానికి తగ్గిందని తెలిపింది ఆర్థిక సర్వే.

స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ వార్షిక నివేదిక ప్రకారం: 

స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అంటే, ఫార్మల్ అకడమిక్ సిస్టం కి దూరమైనవారికి మాత్రమే అన్న ఆలోచన చాలా మందిలో ఉందని తేలింది.

కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ 20కంటే ఎక్కువ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ కి వ్యాపించి ఉండటం వల్ల సమన్వయం కొరవడిందని తెలిపింది ఆర్థిక సర్వే.

అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ సిస్టంలో ఉన్న భిన్నత్వం కూడా ఎంప్లాయర్స్ ని కన్ఫ్యూజన్ కి గురిచేస్తోందని తెలిపింది.

ఆంట్రప్రెన్యూర్షిప్ లాంటి అంశాలను ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేర్చకపోవటం కూడా నిరుద్యోగితకు కారణంగా తెలిపింది.

మెంటర్షిప్ లేకపోవటం, ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు లేకపోవటం వల్ల స్టార్ట్అప్స్ పెరగకపోవడం కూడా నిరుద్యోగితకు కారణంగా తెలిపింది ఆర్థిక సర్వే.