కల్తీ ఆహారం, AI సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి : ఆర్థిక సర్వే

కల్తీ ఆహారం, AI సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి : ఆర్థిక సర్వే

కేంద్ర బడ్జెట్ 2024.. 25 పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు.. ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో విడుదల చేశారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. 2024, జూలై 22వ తేదీ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం...

>>> 2025లో దేశ ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7 శాతంగా ఉంటుందని అంచనా. మార్కెట్ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. అందుకు తగ్గట్టుగా రిస్క్ ఎక్కువగా ఉంటుందని.. అయినా వృద్ధి రేటును కొనసాగుతుందని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి.
>>> 2025 ఏడాదిలో ద్రవ్యోల్భణం.. ధరల సూచి 4.5 శాతంగా ఉంటుందని.. 2026 నాటికి ధరల సూచిని 4.1 శాతానికి తగ్గించటమే లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారామె. 
>>> దేశంలోని ప్రజలు 54 శాతం వ్యాధులు, రోగాలకు కల్తీ, అనారోగ్యకరమైన ఆహారమే కారణం అని.. ఈ విషయంలో మార్పు అవసరం అని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. సమతుల్యమైన ఆహారం, నాణ్యమైన ఆహారం వైపు మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక సర్వే చెబుతోంది. 
>>> చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా పెరిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. దీని వల్ల దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు పెంచటానికి ఈ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేసింది ఆర్థిక సర్వే.
>>> ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AI ప్రభావం ఉద్యోగులు, కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. 
>>> పప్పు ధాన్యాల లోటు కొనసాగటం వల్ల.. దిగుమతులు తప్పవు అనేది స్పష్టం చేసింది ఆర్థిక సర్వే.
>>> 2023, 24 సంవత్సరాల్లో దేశంలోని బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు అద్భుతమైన పనితీరు చూపించటంతో.. ఆర్థిక ఒడుదుడుగులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు స్పష్టం చేస్తుంది ఆర్థిక సర్వే. 
>>> ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు, దేశంలోని క్లిష్టమైన ఆర్థిక రంగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే స్థానిక ఉత్పత్తులు, వినియోగం ద్వారానే అడ్డుకట్ట వేయొచ్చని అభిప్రాయపడింది ఆర్థిక సర్వే. 

Also Read :- ఐదు రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బడ్జెట్ ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఎన్నో అంశాలను ప్రస్తావించినా.. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు, కల్తీ ఆహారం, AI ద్వారా వచ్చే ఉద్యోగ, ఉపాధి ముప్పును ప్రముఖంగా ప్రస్తావించటం ద్వారా.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే హెచ్చరించినట్లు అయ్యింది.