కాకతీయుల ఆర్థిక వ్యవస్థ..జాబ్స్ స్పెషల్

  • విద్యాధికులైన బ్రాహ్మణులకు బంగారు ఆవులను దానం చేసిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు. 
  •  కాకతీయ యుగం సామాజిక వ్యవస్థకు ఒక ప్రత్యేక లక్షణం కుల సంఘాలు.
  •  కాకతీయ యుగంలో కుల సంఘాలను సమయము అని పిలిచేవారు. 
  • కాకతీయుల కాలంలో బ్రాహ్మణ సమయాన్ని మహాజనులు అని పిలిచేవారు. 
  • కాకతీయుల యుగంలో వైశ్య సంఘాన్ని నకర అని పిలిచేవారు.
  • కాకతీయుల కాలంలో చతుర్థ కులజులకు ప్రాబల్యం పెరిగింది.
  •  కాకతీయుల కాలంలో కనిపించిన దురాచారాలు బాల్య వివాహాలు, వరశుల్కం, నిర్బంధ వైధవ్యం, సతీసహగమనం, జూదం, మద్యపానం, కోడి, పొట్టేళ్ల పందేలు. 
  •  కాకతీయుల కాలంలో రాజు కింద ఉండే పొలాన్ని రాచపొలం అని పిలిచేవారు. పెద్ద చెరువులను సముద్రాలనే వారు. 
  •  ఒక చెరువు నిండిన తర్వాత మిగులు కింది వరుసలో నిర్మించిన చెరువుల్లోకి ప్రవహించేటట్లు చేశారు. వీటిని గొలుసుకట్టు చెరువులు అంటారు. 
  • కాకతీయుల కాలం నాటి చెరువుల గురించి మొటుపల్లి, బయ్యారం శాసనాలు తెలుపుతున్నాయి. 
  • వరంగల్​ జిల్లా మహబూబా​బాద్ తాలుకాలో ఉన్న కేసముద్రం లేదా కేసరి సముద్రం లేదా కేసరి తటాకాన్ని మొదటి ప్రోలరాజు లేదా ప్రోలరాజు అరిగజకేసరి నిర్మించాడు. 
  • వరంగల్​ జిల్లాలోని సెట్టికెరెయ చెరువును రెండో బేతరాజు తవ్వించాడు. అనుమకొండ చెరువును రుద్రదేవుడు తవ్వించాడు. 
  • నర్సంపేట తాలుకా మానేరు బేసిన్​లో ఉన్న పాకాల చెరువును గణపతిదేవుడి మంత్రి బయ్యన నాయకుడి కొడుకైన జగదాల ముమ్మడి. 
  • ములుగు తాలుకా పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప చెరువును క్రీ.శ.1213లో గణపతిదేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. 
  • వరంగల్​ జిల్లాలోని ఘన్​పూర్​ చెరువును గణపతిదేవుని కాలంలో తవ్వించారు. 
  • ఖమ్మం జిల్లా బయ్యారంలోని బయ్యారం చెరువును గణపతిదేవుని సోదరి, నతవాడి రుద్రుని భార్య మైలాంబ తవ్వించింది.
  • కుందవరంలోని కుందసముద్రాన్ని గణపతిదేవుని సోదరి కుందమాంబ తవ్వించింది. 
  • వరంగల్​ జిల్లా కొండపర్తి గ్రామంలోని చౌండ సముద్రాన్ని గణపతి దేవుని సేనాని మల్యాల చౌండ నిర్మించాడు. 
  • కాకతీయుల కాలంలో వ్యవసాయానికి నీరు అందించడంలో చెరువులతోపాటు ఊట కాలువలు ముఖ్యపాత్ర పోషించాయి. 
  • కాకతీయుల కాలంలో చెరువులు, కాలువల మరమ్మతుల పనులు చేసే వారికి పండిన పంటలో ప్రతి పుట్టి ధాన్యానికి ఒక కుంచం ధాన్యం చెల్లించాలని శాసించి అమలు చేశారు. దీనిని దశబంధ లేదా దశవంధమాన్యం అని పిలిచేవారు. 
  • కాకతీయులు వ్యవసాయ భూములను మాగాణి, మెట్ట అని విభజించారు. 
  • కాకతీయుల కాలంలో మాగాణి భూములను నీరి నేల (ధాన్యం పండే భూమి), తొంట నేల (తోటలు) అని విభజించారు. 
  • కాకతీయుల కాలంలో పండిన మెట్ట పంటలు నువ్వులు, ఆవాలు, ఆముదం, నీలిమందు, రాగులు.
  • కాకతీయుల కాలంలో నాగళ్లతో దున్నిన భూములను అచ్చుకట్టు భూములు అనేవారు. 
  • అచ్చుకట్టు అంటే ఆరి అనే పన్ను వసూలు చేసే భూములు.
  • కాకతీయుల కాలంలో సువాసనలు గల వరి పండించే ప్రాంతం ఓరుగల్లు ప్రాంతం. 
  • తెలంగాణ ప్రాంతంలో కందిపప్పు కాకతీయుల కాలంలో వాడుకలోకి వచ్చింది.
  • కాకతీయుల కాలంనాటి తోట పంటలు కొబ్బరి, జామ, మామిడి, అరటి, ఆకు కూరల తోటలు.
  • కాకతీయుల కాలంలో ప్రతి గ్రామంలో బెల్లం, పంచదార, నూనె పరిశ్రమలు ఉండేవి. 
  • పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో 20కు పైగా రకాల వస్ర్తాలను పేర్కొన్నాడు.
  • మార్కోపోలో ప్రకారం కాకతీయ సామ్రాజ్యంలోని మైసోలియా లేదా మచిలీపట్టణంలో మహారాజులు సైతం మెచ్చుకొనే వస్త్రాలు తయారు చేసేవారు. 
  • కాకతీయుల కాలంలో రత్నకంబళ్లు, మఖ్​మల్​ వస్త్రాలు ప్రత్యేకంగా తయారు చేసేవారు.
  • నిర్మల్​లో తయారయ్యే కత్తులు విదేశాల్లో కూడా ప్రచారంలోకి వచ్చాయి.
  • కాకతీయుల కాలంలో గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లు విదేశీ యాత్రికుడు మార్కోపోలో పేర్కొన్నాడు.
  • కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం మోటుపల్లి. 
  • కాకతీయుల కాలంలో చైనా, పర్షియా, అరేబియా, సింహళం, తూర్పు ఇండియా దేశాలతో వాణిజ్యం జరిగేది.
  • కాకతీయుల కాలంలో భూములపై పన్ను, పంగము, కానిక, దరిశనము అనే పన్నులు వసూలు చేసేవారు. 
  • కాకతీయుల కాలంలో పరిశ్రమలపై వసూలు చేసే పన్నులు అరి, సుంకం, పన్ను, కానిక, పుట్టిమానిక.