పాకెట్ ఫ్రెండ్లీ రెయిన్ కార్డ్
ఎకోస్పిట్ యునిసెక్స్ అడల్ట్ రెయిన్కార్డ్. ఈ రెయిన్కార్డ్ను విజిటింగ్ కార్డ్‌లా పర్సులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. పలురకాల రంగుల్లో ఉన్న ఇవి ప్రయాణాలకు బాగా ఉపయోగంగా ఉంటాయి. మందపాటి మెటీరియల్‌తో తయారైనా కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. సాధారణంగా అయితే డిస్పోజబుల్ ప్రొడక్ట్స్ కొన్నిసార్లు వేసుకుంటుంటేనే చిరిగిపోతాయి. అంతేకాకుండా ఒకసారి వాడి పడేయడం వల్ల పర్యావరణానికి కూడా మంచిది కాదు. కానీ ఈ రెయిన్కార్డ్ను మాత్రం ఒకసారి పారేయాల్సిన అవసరంలేదు. మళ్లీ మళ్లీ వాడొచ్చు. బ్యాక్‌ప్యాక్ మీద కూడా ఈ రెయిన్ కోట్ వేసుకోవచ్చు. సాధారణంగా జర్నీ చేసేటప్పుడు గొడుగు లేదా పెద్ద రెయిన్‌కోట్ పట్టుకెళ్లాలంటే బరువుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇవి తీసుకెళ్తే స్పేస్ ఆదా అవుతుంది. బరువు సమస్యా ఉండదు. ఇసి ఎవా కంపెనీ తయారుచేసిన ఈ లైట్‌వెయిట్ రెయిన్‌కోట్ జాకెట్ వర్షంలో వాడిన ప్రతిసారి బాగా ఆరబెట్టాలి. ఆరిన తరువాతనే మడతపెట్టి దాచుకోవచ్చు. దీని తయారీకి వాడిన మెటీరియల్ వల్ల దీన్నుంచి ఎటువంటి వాసన ఉండదు. ఇది నాన్టాక్సిక్ పీవీసీ మెటీరియల్‌తో తయారైంది. తల నుంచి మోకాళ్ల కింద వరకు తడవకుండా వర్షం వల్ల మీ పనులు ఆగిపోకుండా సాగిపోవచ్చు.
ధర: 49 రూపాయలు
వర్షంలో రయ్ రయ్
వర్షం పడుతున్నప్పుడు రెయిన్‌కోట్ వేసుకుని టూ వీలర్ డ్రైవింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే రెయిన్‌కోట్ కొంత మేరకు మాత్రమే తడవకుండా కవర్ చేస్తుంది కాబట్టి. రెయిన్ కోట్ వేసుకున్నా చేతులు, ముఖం ఎంతోకొంత తడుస్తాయి. అలాకాకుండా లేసిన్ కంపెనీ తయారుచేసిన ఈ రెయిన్‌కోట్ అయితే మిమ్మల్నే కాదు... అంతో ఇంతో మీ వెహికల్‌ను కూడా తడవకుండా చేస్తుంది. వాటర్‌ప్రూఫ్‌తో తయారైన ఈ రెయిన్‌కోట్ తల నుంచి మెడను కప్పుతూ చేతుల మీదుగా వచ్చి మోకాళ్ల కింద వరకు ఉంటుంది. అందుకని తల దగ్గర నుంచి పాదాల వరకు తడవకుండా కవర్ చేస్తుంది. బండి హ్యాండిల్, ముందు భాగాన్ని కూడా వకర్ చేస్తూ వేసుకోవాలి కాబట్టి. బండి ముందు భాగం కూడా తడవదు. దీన్ని పొడవుగా ఉండే మోటార్‌సైకిల్, బైక్, స్కూటర్ డ్రైవింగ్‌కు వాడొచ్చు. ఎంత భారీ వర్షం వచ్చినా, గాలులు వీచినా స్ట్రాంగ్‌గా ఉండేలా తయారుచేసింది కంపెనీ. దీన్ని క్యారీ చేయడం చాలా ఈజీ. ఈ రెయిన్‌కోట్‌ని బండి నడిపే వాళ్లతో పాటు వెనక కూర్చున్న వాళ్లు కూడా వేసుకోవచ్చు. వెహికల్ నడిపేటప్పుడే కాకుండా థీమ్ పార్క్, క్యాంపింగ్, హైకింగ్ వంటి వాటికి వెళ్లినప్పుడు కూడా దీన్ని వాడొచ్చు.
ధర: 1,999 రూపాయలు
షూ తడవకుండా..
వానాకాలం షూస్ వేసుకునే వాళ్లకు ఒక పెద్ద పరీక్షలా ఉంటుంది. ఇలాంటప్పుడు షూస్ తడిచి పాడుకాకుండా కవరింగ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వాటర్‌ప్రూఫ్ సిలికాన్ షూస్ కవర్స్ మార్కెట్లోకి తెచ్చింది ఓం టాయ్ జోన్. 140 గ్రాముల బరువు ఉండే ఈ కవర్స్‌ని ఒకసారి వాడాక పడేయాల్సిన అవసరం లేదు. మళ్లీ వాడుకోవచ్చు. కాకపోతే వాడిన వాటిని పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టాలి. మరి షూస్ తడవనీయదు ఈ కవర్ అంటే నేలమీద నడుస్తుంటే జారిపోదా అనే డౌట్ రావచ్చు. నాన్ స్లిప్పరీగా తయారుచేశారు. కాబట్టి జారే అవకాశం ఉండదు అంటోంది కంపెనీ. షూ సైజ్ బట్టి కవర్ ఎంపిక చేసుకోవాలి. వర్షాకాలంలో షూ పాడుకాకుండా ఉండేందుకు ఇవి చాలా బాగా పనికొస్తాయి.
ధర: 189 రూపాయలు
యాక్టివాకి రెయిన్ కోట్
వర్షాకాలంలో వానకు తడిచి యాక్టివా వెహికల్ పాడవకుండా ఉండాలంటే రెయిన్‌కోట్ వేయాల్సిందే! వైటల్ క్రియేషన్స్ తయారుచేసిన ఈ కవర్ యాక్టివా 5జి, 6జి మోడల్స్‌కి వస్తుంది. వర్షానికి తడవకుండానే కాకుండా మామూలు రోజుల్లో బండి మీద గీతలు పడకుండా, ఎండకు రంగు మారిపోకుండా... ఒక్కమాటలో చెప్పాలంటే బండి రంగు, రూపు మారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దీన్ని వేయడం వల్ల హ్యాండిల్స్ మీద దుమ్ము పడదు. సీట్ కవర్ పాడు కాదు. వర్షాకాలంలో అయితే ఇండికేటర్, స్పీడోమీటర్లు వానకి తడిచి పాడుకావు. ఇది రకరకాల రంగుల్లో దొరుకుతోంది. హ్యాండిల్‌కు ఈ కవర్ ఎలా ఫిట్ చేయాలంటే మొదట సైడ్ మిర్రర్స్ తీసి హ్యాండిల్ కవర్ వేయాలి. ఆ తరువాత మిర్రర్ హోల్‌ని అడ్జస్ట్ చేయాలి. మిర్రర్ హోల్ దగ్గర షార్ప్ టూల్‌తో లోపలికి ఫిట్ చేయాలి. అదెలా ఫిట్ చేయాలనేది ఇక్కడ బొమ్మలో ఉంది. దాన్ని చూస్తూ ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. వెహికల్ ఇండికేటర్, హ్యాండిల్, సీట్... ఇలా అన్ని పార్ట్స్‌కి సరిపడే కోంబో ఇది.
ధర: 549 రూపాయలు