సీఎంతో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ భేటీ

హైదరాబాద్​, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ  గురువారం డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు వివిధ రకాల పంటలపై  చర్చించారు. అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేపట్టాలని జాక్వెలిన్ హ్యూకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.