భూదాన్ భూముల స్కాం: ఈడీ సీజ్ చేసిన 45 వింటేజ్ కార్లు ఇవే..

భూదాన్ భూముల స్కాం: ఈడీ సీజ్ చేసిన 45 వింటేజ్ కార్లు ఇవే..

 భూధాన్ భూములపై ఈడీ కీలక ప్రకటన చేసింది.  హైదరాబాద్ లో ఐదు చోట్ల ప్రభుత్వ భూమి  అన్యాక్రాంతంపై తనిఖీలు విచారణ చేశామని తెలిపింది.  నకిలీ డాక్యుమెంట్స్  సృష్టించి  రెవెన్యూ రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించామని వెల్లడించింది. 

భూదాన్ భూముల్లో ఖదీరున్నీసా  తప్పడు డాక్యుమెంట్లతో మోసపూరితంగా వ్యవహరించారు.  కొంత మంది  రెవెన్యూ అధికారులు, మధ్యవర్తులతో కలిసి మోసపూరితంగా భూములు అమ్మకాలు జరిపారు.  నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూమిని అమ్మారు.    నిందితులు ఖధీరున్నీసా ,  మునావర్ ఖాన్, లతీఫ్ , షర్ఫాన్,  అక్తర్ షర్ఫాన్, సుకూర్ ల నుంచి  ఫేక్ డాక్యుమెంట్స్,  23 లక్షల రూపాయలు , 12 వేల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నాం. మునావర్ ఖాన్  ఫామ్ హౌజ్ లో 45  వింటేజ్ కార్లు స్వాధీనం చేసుకున్నాం అని ఈడీ తెలిపింది.

మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 181లో 104 ఎకరాలను జబర్దస్త్​ఖాన్​అనే వ్యక్తి భూదాన్​ యజ్ఞ బోర్డుకు దానమిచ్చారు. ఆ తర్వాత ఇందులో 42.33 ఎకరాల భూమికి జబర్దస్త్​ఖాన్​ కొడుకు మహమ్మద్​ హాజీఖాన్​పట్టా సంపాదించాడు. అనంతరం ఈ భూమికి తానే వారసురాలునంటూ హాజీఖాన్​ కుమార్తె మహ్మద్ ఖాదిరున్నిసా బేగం తెరపైకి వచ్చారు. 2006లో  ఆమె పేరిట ఎన్​వోసీ రావడంతో మహ్మద్ అక్బర్ అలీఖాన్, మహ్మద్ ఫరూక్ అలీఖాన్ , షరీఫ్, ముజఫర్ హుస్సేన్ ఖాన్​రికార్డుల్లోకి వచ్చారు. 

వీరికి పలువురు మధ్యవర్తులు, రియల్టర్లు తోడయ్యారు. వీరంతా కలిసి 2021లో ఈ భూమిని ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్స్​కు విక్రయించారు. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్​గా అమోయ్​కుమార్, ​మహేశ్వరం తహసీల్దార్​గా జ్యోతి ఉన్నారు. కాగా, ఈ అక్రమ భూబదలాయింపుపై దస్తగిరి అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు నిరుడు మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు.  మహేశ్వరం పోలీసుల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. బాధ్యులందరికీ నోటీసులు జారీ చేశారు. 

కీలకంగా జ్యోతి స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దర్యాప్తులో భాగంగా అప్పటి మహేశ్వరం తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ్యోతి ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈడీ ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకే భూ బదలాయింపు చేశానని జ్యోతి వెల్లడించినట్లు సమాచారం. ఈక్రమంలో అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిరుడు అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  23, 24, 25 తేదీల్లో ఈడీ  అధికారులు ప్రశ్నించి.. భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వివరాలను సేకరించారు. 

►ALSO READ | పాక్ మరో కుట్ర..సైబర్ సెక్యూరిటీ డిఫెన్స్ను ఛేదించేందుకు హ్యాకర్లు యత్నం

నాటి తహసీల్దార్, సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిజస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యోతితో పాటు ఖదీరున్నిసా, ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బొబ్బిలి విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎన్. సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భూదాన్ యజ్ఞ బోర్డు సెక్రటరీ సహా సుమారు15 మంది స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రికార్డ్​చేశారు. ఈక్రమంలోనే ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  వందల కోట్ల విలువైన భూములను రియల్టర్లకు అప్పగించినట్లు గుర్తించారు.