
రాంచీ: చత్తీస్‌గఢ్ మాజీ మినిస్టర్, ప్రస్తుత ఎమ్మెల్యే కవాసీ లఖ్మాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. రూ.2161 కోట్ల చత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్ కేసులో కవాసీ లఖ్మా పాత్రే కీలకమని వెల్లడించారు. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో లఖ్మాకు స్కామ్ ద్వారా నెలవారీ ప్రాతిపదికన భారీగా డబ్బు వచ్చిందన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ బుధవారం కవాసీ లఖ్మాను, ఆయన కొడుకు హరీశ్ లఖ్మాను ఈడీ మూడవసారి విచారణకు పిలిచింది. విచారణ అనంతరం వారిని అరెస్టు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కవాసీ లఖ్మాకు కోర్టు 7 రోజుల రిమాండ్ విధించింది. 21వ తేదీ వరకు ఆయన పోలీసు రిమాండ్‌లో ఉంటారు. అంతకుముందు కవాసీ లఖ్మా నివాసాలపై దాడులు చేసింది.