సీఎం సిద్ధ రామయ్యకు షాక్.. రూ.300 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

బెంగుళూరు:  కర్నాటక సీఎం సీఎం సిద్ధ రామయ్యకు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. కర్నాటకలో సంచనలం సృష్టించిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభ కోణంలో సీఎం సిద్ధ రామయ్య సతీమణికి చెందిన దాదాపు రూ.300 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్య సతీమణికి చెందిన 142 ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు శుక్రవారం (జవవరి17) ఈడీ ప్రకటించింది. 

అసలు ఏంటి ముడా స్కామ్..?

సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట ఉన్న కొన్ని భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్​అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ (ముడా) సేకరించింది. దానికి ప్రతిఫలంగా ముడా వేరే చోట ఆమెకు భూమి కేటాయించింది. సిద్ధ రామయ్య సీఎంగా ఉన్న సమయంలో ఈ తతంగం అంతా జరిగింది. దీంతో సీఎం సిద్ధ రామయ్య ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సామాజిక కార్యకర్తలు ఈ ఇష్యూపై గవర్నర్‎కు ఫిర్యాదు చేశారు.

ALSO READ | కర్ణాటకలో మరో భారీ చోరీ.. పట్టపగలే బ్యాంక్ లో రూ.15 కోట్ల బంగారం రూ. 5 లక్షలతో పరార్

 దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధ రామయ్య, ఆయన సతీమణి పార్వతమ్మ, మరి కొందరిపై లోకాయుత్త పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముడా స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ.. లోకాయుత్త పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు  చేసింది. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధ రామయ్య ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.