లోన్యాప్లపై ఈడీ ఉక్కుపాదం.. రూ.19.39కోట్ల డిపాజిట్లు అటాచ్

లోన్ యాప్ లపై ఈడీ ఉక్కుపాదం మోపుతోంది. లోన్ యాప్ లకేసులో మరో రూ. 19 కోట్ల 39 లక్షల డిపాజిట్లను అటాచ్ చేసింది. గతంలో లోన్ యాప్ లపై తెలంగాణలో 118 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల ఆధారంగా 242 రుణ యాప్ లపై మనీలాండరింగ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గతంలో పలు ఫిన్ టెక్ కంపెనీలకు చెందిన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసింది ఈడీ.

తాజాగా నిమిష ఫిన్ టెక్, రాజ్ కోట్ ఇన్వెస్ట్ మెంట్స్, మహానంద ఇన్వెస్ట్ మెంట్స్, బస్కిన్ మేనేజ్ మెంట్ సహా ఇతర సంస్థలకు చెందిన 19కోట్ల39లక్షల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లను, బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. 

ALSO READ | 2047 నాటికి మన ఎకానమీ .. 55 ట్రిలియన్ల డాలర్లు : ఈడీ కృష్ణమూర్తి