హైదరాబాద్ లో 145 కేజీల గోల్డ్ జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్ లో 145 కేజీల గోల్డ్ జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్:  ముసద్దీలాల్ జ్యూవెలర్స్ కు చెందిన 145 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది ఈడీ. హైదారాబాద్, విజయవాడలో ఒకే సమయంలో సోదాలు నిర్వహించిన ఈడీ 82 కోట్ల విలువ చేసే 145 కేజీల బంగారం స్వాదీనం చేసుకుంది.  పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు ముసద్దీలాల్  జ్యూవెలర్స్ యజమాని కైలాష్ గుప్తా పెద్ద ఎత్తున నోట్ల మార్పిడికి ప్రయత్నించారనే అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో యజమాని కైలాష్ గుప్తా తో పాటు మరో నలుగురు పార్ట్ నర్స్ ఇళ్లలో సోదాలు చేసింది ఈడీ.  పెద్ద నోట్లు రద్దు సమయంలో గంట సమయంలోనే  5 వేల మంది కష్టమర్ల దగ్గర నుండి 110 కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది ఈడీ.  ముసద్దీలాల్ జ్యూవెలర్స్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు పలు చోట్ల సోదాలు జరిపారు.