
హైదరాబాద్, వెలుగు: విదేశాలకు అక్రమంగా మందులు సరఫరా చేసిన కేసులో లూసెంట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.5.67 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. ట్రామాడోల్ మందులను అక్రమంగా ఎగుమతి చేసినందుకు గాను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. నిబంధనలు అతిక్రమించి పలు దఫాల్లో పాకిస్తాన్‌కు ట్రమాడోల్ ఎగుమతి చేసినట్టు ఆధారాలు సేకరించింది. దీంతో కంపెనీకి చెందిన రూ.5.67కోట్లు విలువ చేసే భూములు, బిల్డింగ్స్, ఫ్యాక్టరీలను జప్తు చేసింది.