గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ కి ఈడీ షాక్.. కోట్లు విలువ చేసే ఆస్తులు అటాచ్..

గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ కి ఈడీ షాక్.. కోట్లు విలువ చేసే ఆస్తులు అటాచ్..

తమిళ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కి ఈడీ డిపార్ట్ మెంట్ షాక్ ఇచ్చింది. రోబో సినిమా కాపీ కొట్టారని వ్యవహారంలో రూ. కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్‌ చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే గతంలో శంకర్ తీసిన రోబో సినిమా స్టోరీ తన రాసిన బుక్ నుంచి కాపీ కొట్టారని తమిళనాదన్‌ రైటర్ ఎగ్మోర్‌ కోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసూయం కేసుని విచారించిన కోర్టు శంకర్ కి సంబందించిన ఆస్తులని జప్తు చెయ్యాలని ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు ఆధారంగా అధికారులు శంకర్ కి సంబందించిన  రూ.10 కోట్ల 11 లక్షల ఆస్తులను అటాచ్‌ చేసింది. ఈ విషయం కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే శంకర్ తెలుగులో గేమ్ ఛేంజర్ అనే సినిమాని తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది. దాదాపుగా రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కనీసం రూ.100 కోట్లు కూడా కలెక్ట్ చెయ్యలేకపోయింది. దీంతో నిర్మాతలు భారీగానే నష్టపోయినట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 ప్రీక్వెల్ పై ద్రుష్టి సారించాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.