జార్ఖండ్, బెంగాల్​లో ఈడీ దాడులు

జార్ఖండ్, బెంగాల్​లో ఈడీ దాడులు

రాంచీ/కోల్​కతా: బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి అక్రమ చొరబాట్లకు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ వ్యవహారంపై జార్ఖండ్, బెంగాల్​లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. మంగళవారం రెండు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారని అధికారిక వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్​కు ముందు రోజు ఈడీ రెయిడ్స్ జరగడం సంచలనంగా మారింది. రాంచీలోని హోటల్ వద్ద సీఆర్​పీఎఫ్ బలగాల మోహరింపు, ఓ రిసార్ట్​లో ఈడీ అధికారులు డాక్యుమెంట్లు తనిఖీ చేస్తున్న దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడుల్లో ఫేక్ ఆధార్ కార్డులు, ఫోర్జరీ పాస్ పోర్టులు, ఆయుధాలు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.