న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీపై చార్జ్‌షీట్ ఫైల్ చేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం తెలిపింది. 2015 ఐపీఎల్ బెట్టింగ్ కేసులో అనిల్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, దీంతో ఏప్రిల్‌లో ఆయనను అరెస్ట్ చేశామని పేర్కొంది. 2015లో స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్‌ఏ) కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత తామిచ్చిన సమన్లకు అతను రెస్పాండ్ అవ్వడంలేదని, విచారణకు కూడా సహకరించడంలేదని ఈడీ అధికారులు వెల్లడించారు.
అనిల్ కూతురు అనిక్ష కూడా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్ అయింది. తన తండ్రికి బెయిల్ ఇప్పించాలని, అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానంటూ అమృతను ఆమె కోరింది. లేకపోతే, ప్రైవేట్ మెసేజ్‌లను బయటపెడతానని అనిక్ష అమృతను బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.