
భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) స్పీడు పెంచింది. భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయనే ఆరోపణలతో రంగంలోకి దిగిన ఈడీ మరోసారి తనిఖీలు చేపట్టటింది. అక్రమంగా లే అవుట్ చేసి భూములను అమ్ముకున్న పలువురి ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది ఈడీ.
మహేశ్వరం భూదాన్ భూముల విషయంలో ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. సోమవారం (ఏప్రిల్ 28) హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా లు భూములను అక్రమంగా లే అవుట్ చేసి అమ్మకున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో ఈడీ రంగంలోకి దిగింది.
Also Read:-హైదరాబాద్ సిటీలో నల్లాల్లో నలకలు లేని నీళ్లు.. GHMC సమ్మర్ యాక్షన్ ప్లాన్
పాత బస్తీ లో మున్వర్ ఖాన్ , ఖదీర్ ఉన్నిస్, సర్ఫాన్, సుకుర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది ఈడీ. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్ ను కూడా ఈడీ విచారణ చేసిన సంగతి తెలిసిందే. పాతబస్తీతో పాటు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విరాట్ నగర్ లో కూడా తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఈ కేసులో సంబంధం ఉందన్న ఆరోపణలతో MA సుకూర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.