
భిలాయ్/రాయ్‌పూర్: లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన కుమారుడు చైతన్య బాఘెల్‌కు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘెల్ తెలిపారు. చైతన్య బాఘెల్ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి శనివారం ఈడీ కార్యాలయానికి రావాలని సమన్లు జారీ చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో భిలాయ్ (దుర్గ్ జిల్లా)లోని బాఘెల్ నివాసం, రాయ్‌పూర్‌లోని ఈడీ కార్యాలయం వద్ద ఉదయం నుంచి మీడియా ప్రతినిధులు గుమిగూడారు. ఈ సందర్భంగా భూపేశ్ బాఘెల్ తన ఇంటి ముందు మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు చైతన్యకు ఎలాంటి నోటీసు అందలేదని, ఒకవేళ అందితే.. తప్పకుండా హాజరవుతాడని ఆయన పేర్కొన్నారు.