నాగారం భూ కేసులో ఈడీ విచారణ

నాగారం భూ కేసులో ఈడీ విచారణ

మహేశ్వరం నాగారం భూకేసులో ఈడీ విచారణ ప్రారంభించింది.  ఈ కేసులో మాజీ ఆర్డీవో వెంకటాచారి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మహేశ్వరం మాజీ ఆర్డీవో, ఐఏఎస్​ అధికారి అమోయ్​ కుమార్​... ఎమ్మార్వో జ్యోతిలను విచారించిన తరువాత మాజీ ఆర్డీవో వెంకటాచారికి ఈడీ సమన్లు జారీ చేసింది.  నాగారంలోని సర్వే నెంబరు 181 లో 42 ఎకరాల భూ కేటాయింపులపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. మెహదీపట్నానికి చెందిన షరీఫ్​ ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పీఎస్​ లో కేసు నమోదైంది. 2023 మార్చిలో పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.