- కార్వీ కేసు విచారణ వేగవంతం
- రెండో రోజు కొనసాగుతున్న విచారణ
కార్వీ కేసు విచారణను ఈడీ వేగవంతం చేసింది. మనీ లాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న కార్వి ఎండీ పార్థసారథి, CFO కృష్ణహరిలను రెండోరోజు కూాడా కస్టడీలోకి తీసుకుంది ఈడీ. గతంలో సీసీఎస్లో కేసు ఆధారంగా విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్, నిధుల దారి మళ్లింపు, షెల్ కంపెనీల వ్యవహారం, విదేశీ పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. షేర్ మార్కెట్ లలో పెట్టుబడుల పేరిట భారీ మోసాలకు పాల్పడినట్టు ఇప్పటికే గుర్తించారు. ఇప్పటికే ఈడీ అధికారులు కార్వీకి సంబంధించిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసిన విషయం తెలసిందే.
ఇవి కూడా చదవండి
రీజినల్ భద్రత సాధిద్దాం
చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్