కేరళ సీఎం కూతురిపై ఈడీ మనీలాండరింగ్ కేసు

కేరళ సీఎం పినరయి విజయన్‌ కుమార్తె వీణపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణ సహా మరికొందరిపై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా 2017-2020 మధ్యకాలంలో కొచ్చిన్ మినరల్స్ & రుటైల్ లిమిటెడ్ సంస్థ వీణకు రూ.1.72కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

ఈ డీల్‌లో CPI(M) సహా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని UDF పక్షం నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.  కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఈడీ ఈ  కేసు నమోదు చేసింది.  

Also Read : ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేసిన రెండున్నరేళ్ల చిన్నారి