యూ బిట్ ‌‌‌‌‌‌‌‌ కాయిన్ ‌‌‌‌‌‌‌‌ దందాపై... ఈడీ ఫోకస్ 

యూ బిట్ ‌‌‌‌‌‌‌‌ కాయిన్ ‌‌‌‌‌‌‌‌ దందాపై... ఈడీ ఫోకస్ 
  • నిర్మల్ ‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ ‌‌‌‌‌‌‌‌ చేసిన పోలీసులు
  • దందాపై ఎన్ ‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్ ‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదులు
  • పూర్తి వివరాలు పంపాలని ఎస్పీకి లెటర్ ‌‌‌‌‌‌‌‌ రాసిన ఈడీ
  • మనీ లాండరింగ్ ‌‌‌‌‌‌‌‌ కేసుగా పరిగణిస్తూ దర్యాప్తు

నిర్మల్, వెలుగు : నిర్మల్ ‌‌‌‌‌‌‌‌ జిల్లాలో రెండు నెలల నుంచి చర్చనీయాంశంగా మారిన యూ బిట్ ‌‌‌‌‌‌‌‌ కాయిన్ ‌‌‌‌‌‌‌‌, క్రిప్టో కరెన్సీ చైన్ ‌‌‌‌‌‌‌‌ దందాపై ఈడీ (ఎన్ ‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్ ‌‌‌‌‌‌‌‌) రంగంలోకి దిగింది. జిల్లాలో జరుగుతున్న బిట్ ‌‌‌‌‌‌‌‌ కాయిన్ ‌‌‌‌‌‌‌‌ దందాపై ఈడీకి ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన ఈడీ పూర్తి వివరాలు పంపాలంటూ ఎస్పీ జానకీ షర్మిలకు లెటర్ ‌‌‌‌‌‌‌‌ రాశారు. 

ఇప్పటికే 8 మంది అరెస్ట్ ‌‌‌‌‌‌‌‌

నిర్మల్ ‌‌‌‌‌‌‌‌ జిల్లా కేంద్రంగా మొదలైన ఈ బిట్ ‌‌‌‌‌‌‌‌కాయిన్ ‌‌‌‌‌‌‌‌ చైన్ ‌‌‌‌‌‌‌‌ సిస్టమ్ ‌‌‌‌‌‌‌‌ అదిలాబాద్ ‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్ ‌‌‌‌‌‌‌‌, జగిత్యాల, కామారెడ్డి తదితర జిల్లాల్లో కూడా విస్తరించింది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీస్ ‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్ ‌‌‌‌‌‌‌‌, రిటైర్డ్ ‌‌‌‌‌‌‌‌ ఆర్మీ ఉద్యోగి, ఎక్సైజ్ ‌‌‌‌‌‌‌‌ ఎస్సై ఈ దందాలో స్టార్ ‌‌‌‌‌‌‌‌ మాస్టర్లుగా వ్యవహరించారు. ఆయా జిల్లాల పరిధిలోని అనేక మంది ఈ దందాలో కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. ఈ దందా విషయం తెలిసి ఫోకస్ ‌‌‌‌‌‌‌‌ చేసిన ఎస్పీ జానకీ షర్మిల సూత్రధారులుగా వ్యవహరిస్తున్న ఎనిమిది మందిని గతంలోనే అరెస్ట్ ‌‌‌‌‌‌‌‌ చేసింది. వీరంతా ఇప్పుడు బెయిల్ ‌‌‌‌‌‌‌‌పై బయటకు వచ్చారు. యూ బిట్ ‌‌‌‌‌‌‌‌ కాయిన్ ‌‌‌‌‌‌‌‌ వ్యవహారంపై ఎన్ ‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్ ‌‌‌‌‌‌‌‌కు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో మొత్తం వివరాలు రాబట్టేందుకు ఈడీ ఈ దందాపై ఫోకస్ ‌‌‌‌‌‌‌‌ చేసింది.

అంతర్జాతీయ స్థాయిలో దందా...

యూ బిట్ ‌‌‌‌‌‌‌‌ కాయిన్ ‌‌‌‌‌‌‌‌ క్రిప్టో కరెన్సీ దందా అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ ‌‌‌‌‌‌‌‌ఐఆర్ ‌‌‌‌‌‌‌‌తో పాటు రిమాండ్ ‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ ‌‌‌‌‌‌‌‌, బ్యాంక్ ‌‌‌‌‌‌‌‌ అకౌంట్ ‌‌‌‌‌‌‌‌ వివరాలు, నిందితులకు సంబంధించిన వ్యాపార వివరాలు, వారి ఆర్థిక స్థితిగతుల రిపోర్ట్ ‌‌‌‌‌‌‌‌లను తమకు పంపాలని ఈడీ నుంచి ఎస్పీకి లెటర్ ‌‌‌‌‌‌‌‌ అందింది. ఈ వివరాలన్నీ అందిన తర్వాత ఈడి ఎన్ ‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌ కేస్ ‌‌‌‌‌‌‌‌ ఇన్ఫర్మేషన్ ‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ (ఈసీఐఆర్) రెడీ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ ‌‌‌‌‌‌‌‌ కేసుగా పరిగణిస్తూ పకడ్బందీగా దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే కోట్ల రూపాయలు వ్యాపారం చేసిన స్టార్ ‌‌‌‌‌‌‌‌ హోల్డర్లు ఈ డబ్బును ఎక్కడ దాచి పెట్టారన్న వివరాలను కూడా సేకరించనున్నట్లు సమాచారం. ఈడీ రంగంలోకి దిగగానే నిందితులందరినీ అదుపులోకి తీసుకొని వారి ఆస్తులను సైతం జప్తు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టించిన స్టార్ హోల్డర్లు

యూ బిట్ ‌‌‌‌‌‌‌‌ కాయిన్ ‌‌‌‌‌‌‌‌ దందాలో రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల పెట్టుబడి పెట్టించిన వారికి వన్ ‌‌‌‌‌‌‌‌ స్టార్ ‌‌‌‌‌‌‌‌ గుర్తింపు లభిస్తుంది. అలాగే రూ. 25 లక్షలు పెట్టించిన వారికి టూ స్టార్, రూ. 50 లక్షలు పెట్టించిన వారికి త్రీ స్టార్ ‌‌‌‌‌‌‌‌, రూ. 75 లక్షలు పెట్టిస్తే ఫోర్ ‌‌‌‌‌‌‌‌ స్టార్ ‌‌‌‌‌‌‌‌, రూ. కోటి వరకు పెట్టిస్తే ఫైవ్ ‌‌‌‌‌‌‌‌ స్టార్ ‌‌‌‌‌‌‌‌ రేటింగ్ ‌‌‌‌‌‌‌‌లను ఇస్తుంది. ఈ రేటింగ్ ‌‌‌‌‌‌‌‌ ఆధారంగా యాప్ ‌‌‌‌‌‌‌‌లోని వారి అకౌంట్ ‌‌‌‌‌‌‌‌లో కమిషన్ రూపంలో పెద్దమొత్తం జమ అవుతున్నట్లు సమాచారం. కాగా జిల్లాలో టీచర్లతో పాటు అటవీ శాఖ ఉద్యోగులు, పోలీస్ ‌‌‌‌‌‌‌‌ సిబ్బంది, రియల్ ‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ ‌‌‌‌‌‌‌‌ వ్యాపారం చేసేవారు 20 నుంచి 30 మంది వరకు ఈ స్టార్ ‌‌‌‌‌‌‌‌ రేటింగ్ ‌‌‌‌‌‌‌‌లు పొందినట్లు తెలుస్తోంది. వీరంతా తమకున్న పరిచయాలను అడ్డం పెట్టుకొని వేలాది మందిని సభ్యులుగా చేర్పిస్తూ వారి నుంచి కమిషన్ ‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారని పలువురు చెబుతున్నారు. రూ. లక్ష పెట్టుబడి పెట్టించిన వారికి ప్రతి నెల రూ.14,850 కమీషన్ ‌‌‌‌‌‌‌‌గా జమ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ లావాదేవీలన్నీ బ్యాంక్ ‌‌‌‌‌‌‌‌ అకౌంట్ ‌‌‌‌‌‌‌‌లో కాకుండా యాప్ ‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన అకౌంట్ ‌‌‌‌‌‌‌‌లో జమ అవుతుండడం అనుమానాలకు తావిస్తోంది.

ఢిల్లీ కేంద్రంగా ఈ నెట్ ‌‌‌‌‌‌‌‌వర్క్ ‌‌‌‌‌‌‌‌ సాగినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దందా సూత్రధారులు నకిలీ యూ బిట్ కాయిన్ ‌‌‌‌‌‌‌‌ పేరిట ఓ ప్రత్యేక యాప్ ‌‌‌‌‌‌‌‌ను రూపొందించి దీని ద్వారా మొత్తం దందా సాగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. యూ బిట్ ‌‌‌‌‌‌‌‌ కాయిన్ ‌‌‌‌‌‌‌‌ దందాలో పెట్టుబడులు పెట్టే వారికి ఈ యాప్ ద్వారానే యూజర్ ‌‌‌‌‌‌‌‌ఐడీ, పాస్ ‌‌‌‌‌‌‌‌వర్డ్ ‌‌‌‌‌‌‌‌ కేటాయించి వీటి ద్వారానే పెట్టుబడులు పెట్టించినట్లు సమాచారం.