హైదరాబాద్, బెంగళూర్‌లో ఈడీ సెర్చ్
హైదరాబాద్, వెలుగు : మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్, క్యూనెట్‌కు చెందిన రూ.137 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది. 50 బ్యాంక్ అకౌంట్స్‌ను సీజ్ చేసినట్లు బుధవారం రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్‌లో ఈడీ వెల్లడించింది. ఈనెల 24న హైదరాబాద్‌లో నాలుగు, బెంగళూర్‌లోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు పేర్కొంది. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రొడక్ట్స్ సెల్లింగ్‌తో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ఈ సంస్థలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని వివరించింది.
సైబరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా నమోదైన 38 కేసుల ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేశామని ఈడీ పేర్కొంది. దర్యాప్తులో భాగంగా విహాన్, క్యూనెట్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్స్ తనిఖీలు చేశామని వివరించింది. మనీలాండరింగ్ ద్వారా డబ్బు సేకరించినట్లు గుర్తించామని, 50 బ్యాంక్ అకౌంట్స్‌లో జమ ఉన్న రూ.137 కోట్లు ఫ్రీజ్ చేశామని ప్రకటించింది. దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొంది.