ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. నిరుడు మార్చిలో అరెస్ట్ అయిన అర్వింద్ కేజ్రీవాల్‌పై.. ఈడీ అధికారులు ఇప్పటికే స్పెషల్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను విచారించేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఎల్జీ వీకే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. దీనికి ఆయన ఆమోదం తెలపడంతో ఈ విషయాన్ని ఈడీ.. కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయన్ను విచారించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ఆప్‌పై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మోదీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ లీడర్లను కించపరుస్తూ ఏఐ వీడియోలు క్రియేట్ చేసినందుకు 4 ఎఫ్ఐఆర్లు, పూర్వాంచలీయులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు కేజ్రీవాల్‌పై ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అన్ని ఎఫ్ఐఆర్లలో ఢిల్లీ సీఎం ఆతిశి, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్ పేర్లున్నాయి.