ఈడీ ముందుకు అజారుద్దీన్​

ఈడీ ముందుకు అజారుద్దీన్​
  • నిధులు మళ్లించారనే ఆరోపణలపై ప్రశ్నించిన ఈడీ స్పెషల్ ‌‌టీమ్ ‌

హైదరాబాద్ ‌‌,వెలుగు: ఉప్పల్ ‌‌ స్టేడియంలో నిధుల గోల్ ‌‌మాల్ ‌‌ కేసులో మాజీ క్రికెటర్ ‌‌ ‌‌, హెచ్ ‌‌సీఏ మాజీ అధ్యక్షుడు అజహరుద్దీన్ ‌‌ మంగళవారం ఎన్ ‌‌ఫోర్స్ ‌‌మెంట్ ‌‌ డైరెక్టరేట్ ‌‌(ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11గంటల సమయంలో అజహరుద్ధీన్ ‌‌ ఈడీ కార్యాలయానికి వచ్చారు. జాయింట్ ‌‌ డైరెక్టర్ ‌‌  ‌‌సమక్షంలో విచారణకు హాజరయ్యారు. అసిస్టెంట్  డైరెక్టర్ ‌‌ ‌‌ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల స్పెషల్ ‌‌  టీమ్ ‌‌ ఆయనను దాదాపు 9 గంటల పాటు విచారించింది.

గతేడాది నవంబర్​‌‌లో జరిపిన సోదాల్లో సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ‌‌  ఆధారంగా ప్రశ్నించింది. ఉప్పల్ ‌‌లో నమోదైన మూడు కేసుల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయగా, ఈ నెల ‌‌ 3న విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఆ రోజు విచారణకు రాకపోవడంతో ఈ నెల 8న విచారణకు రావాలని మరోసారి సమన్లు జారీ చేయగా, ఈడీ ముందు హాజరై వ్యక్తిగత సమాచారం పాన్ ‌‌ కార్డ్, ‌‌ ఇతర డాక్యుమెంట్స్ ‌‌ను అందించారు. ఐదుగురు సభ్యుతో కూడిన స్పెషల్ టీమ్ అజహరుద్ధీన్ ‌‌ను ప్రశ్నించింది. 11:30 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ప్రశ్నించారు.

ఆయన ఇచ్చిన స్టేట్ ‌‌మెంట్ ‌‌ రికార్డ్  చేశారు. 2020 మార్చి నుంచి 2023 ఫిబ్రవరి మధ్య కాలంలో హెచ్ ‌‌సీఏ ఆర్ధిక లావాదేవీల వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఏసీబీ, ఈడీ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, ఆడిట్ రిపోర్ట్ ‌‌ల వివరాలతో ప్రశ్నించినట్లు సమాచారం. జనరేటర్లు, జిమ్ ‌‌ పరికరాలు, క్రికెట్ ‌‌ బాల్స్ ‌‌, అగ్నిమాపక పరికరాలు, ఇతర సామాగ్రి కొనుగోలుకు సంబంధించిన టెండర్స్ ‌‌,బిడ్స్‌,బిల్స్ ‌‌, ఇన్ ‌‌వాయిస్ ‌‌లను పరిశీలించినట్లు తెలిసింది.

ఈ క్రమంలో స్టేడియం నిర్వహణ కోసం కొనుగోలు చేసిన పరికరాలకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.20 కోట్లు ప్రైవేట్ ఏజెన్సీలకు చేరినట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను అందించాలని ఈడీ అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. విచారణకు అందుబాటులో ఉండాలని అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పినట్లు సమాచారం.