
- కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద 35 ప్రాపర్టీస్
- కోర్టు ఆదేశాలతో జప్తు చేయనున్న ఈడీ
హైదరాబాద్, వెలుగు: గ్యాంగ్‌స్టర్ నయీం భూకబ్జాల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. బెదిరింపులు, అక్రమంగా సంపాదించిన ఆస్తుల చిట్టాను సేకరిస్తున్నది. బినామీల పేర్లతో రిజిస్టర్ చేయించిన స్థిరాస్తులను గుర్తిస్తున్నది. హైదరాబాద్‌తో పాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి సహా రాష్ట్రవ్యాప్తంగా రూ.11.7 కోట్లు విలువ చేసే 35 బినామీ ఆస్తులను గుర్తించింది.
కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలా బేగం, సయ్యద్ నిలోఫర్, ఫిర్దోస్ అంజూమ్, మహమ్మద్ ఆరిఫ్, హసీనా కౌసర్ పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేసినట్లు ఈడీ గుర్తించింది. మరికొంత మంది సన్నిహితుల పేర్ల మీద కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. నయీం దందాపై సిట్ చేసిన దర్యాప్తు ఆధారంగా 2022, మార్చి 31న ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేశారు. దర్యాప్తులో భాగంగా నయీం ఆస్తుల వివరాలు సేకరించారు. కోర్టు అనుమతితో ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు.