హైదరాబాద్ లో ముగిసిన ఈడీ సోదాలు..40 కార్లు సీజ్

హైదరాబాద్ లో ముగిసిన ఈడీ సోదాలు..40 కార్లు సీజ్

హైదరాబాద్‌లో  ఈడీ సోదాలు ముగిసాయి. భూదాన్ భూముల వ్యవహారంలో  ఏప్రిల్ 28 ఉదయం నుంచి 13 చోట్ల ఈడీ సోదాలు చేసింది.  వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది ఈడీ.   మునావర్‌కు చెందిన 40 వింటేజ్ కార్లు సీజ్ చేసింది. మునావర్ ఇంట్లో భారీగా భూదాన్ భూముల పత్రాలు స్వాధీనం చేసుకుంది.  మునావర్ భూ లావాదేవీల పత్రాలను సీజ్ చేసిన ఈడీ  వందల ఎకరాలను కబ్జా చేసి రియల్టర్లు, అధికారులకు అమ్మినట్లు గుర్తించింది.

మహేశ్వరం భూదాన్ భూముల విషయంలో  సోమవారం (ఏప్రిల్ 28)  న హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసాలు భూములను అక్రమంగా  లే  అవుట్ చేసి అమ్మకున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో ఈడీ  సోదాలు చేసింది. పాత బస్తీలో మున్వర్ ఖాన్ , ఖదీర్ ఉన్నిస్, సర్ఫాన్, సుకుర్  ఇంట్లో సోదాలు నిర్వహించింది . 

గతంలో ఇదే కేసులో   ఐఏఎస్ అమయ్ కుమార్ ను కూడా ఈడీ  విచారణ చేసిన సంగతి తెలిసిందే.  పాతబస్తీతో పాటు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విరాట్ నగర్ లో కూడా తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఈ కేసులో సంబంధం ఉందన్న ఆరోపణలతో MA సుకూర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.