TSPSC : టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ

టీఎస్ పీఎస్ సీ(TSPSC) పేపర్ లీకేజీ మనీలాండరింగ్  కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.  టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ ను 5 గంటలుగా విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఈ కేసులో సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మిని విచారించింది ఈడీ. శంకర్ లక్ష్మితో పాటు పేపర్ లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సత్యానారాయణ స్టేట్ మెంట్ ను తీసుకుంది ఈడీ.

పేపర్ లీకేజ్ కేసులో  మొత్తం రూ 31 లక్షలు లావాదేవీలు జరిగనట్లు  సిట్ గుర్తించింది.  దీని ఆధారంగానే  టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్, కార్యదర్శులను ఈడీ  విచారిస్తోంది.  ఇప్పటికే ఈ కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న  ప్రధాన నిందితుల స్టేట్ మెంట్ ను తీసుకున్నారు ఈడీ అధికారులు