విచారణకు రండి: నటి శిల్పాశెట్టి భర్తకు ఈడీ నోటీసులు

విచారణకు రండి: నటి శిల్పాశెట్టి భర్తకు ఈడీ నోటీసులు

ముంబై: నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. పోర్న్​ సినిమాల డిస్ట్రిబ్యూషన్‎కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా వీటిని అందజేసింది. సోమవారం ఉదయం విచారణకు రమ్మని పిలిచింది. ఈ కేసులో సంబంధం ఉన్న మరికొంత మందికి ఈ వారంలో ఈడీ సమన్లు అందజేసిన్నట్టు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితమే రాజ్ కుంద్రాకు సంబంధించిన ఆస్తులపై పలుచోట్ల ఈడీ దాడులు చేసింది. ముంబై, ఉత్తరప్రదేశ్‎లో సోదాలు చేపట్టింది. ఈడీ రెయిడ్స్‎పై శనివారం రాజ్ కుంద్రా స్పందించారు. గత నాలుగేండ్లుగా కొనసాగుతున్న విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నని తెలిపారు.