కేజ్రీవాల్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదురుకుంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు రెడీ అయింది.  2024 మే 10వ తేదీన ఆయనపై ఈడీ ఛార్జ్‌షీట్‌  దాఖలు చేయనుంది.  ఈ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ తొలిసారి నిందితుడిగా పేర్కొననున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కా్మ్ లో ఆయనను కీలక కుట్రదారుగా పేర్కొంటూ ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనుంది.

ఇదే కేసులో  అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కూడా ఈడీ  ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కేసులో 60 రోజుల్లోగా ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్చి 15న కవిత అరెస్టు కాగా..  నేపథ్యంలో మే 15లోగా ఈడీ అనుబంధ ఛార్జ్‌షీట్‌ ను సమర్పించాల్సి ఉంది. .ఈ ఛార్జ్‌షీట్‌ లో అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది.

లిక్కర్ స్కామ్ కేసులో  అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ  మార్చి 21న అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ  కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు.   ఈ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు రానుంది.