పేటీఎంకు ఈడీ నోటీసులు

పేటీఎంకు ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: ఆర్‌‌‌‌బీఐ రూల్స్‌‌ను ఫాలో కాకుండా సింగపూర్‌‌‌‌లో సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేయడం, విదేశాల నుంచి ఇన్వెస్ట్‌‌మెంట్లను పొందడంపై పేటీఎం పేరెంట్ కంపెనీ వన్‌‌ 97 కమ్యూనికేషన్‌‌ (ఓసీఎల్‌‌)కు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్‌‌ రూ.611 కోట్ల షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అంతే కాకుండా ఈ కంపెనీ సబ్సీడరీలు కూడా ఫెమా రూల్స్‌‌ను ఉల్లంఘించాయని పేర్కొంది. లిటిల్ ఇంటర్నెట్‌‌, నియర్‌‌‌‌బై ఇండియాకు కూడా నోటీసులు పంపింది.  ఓసీఎల్ సబ్సిడరీ కంపెనీ నియర్‌‌‌‌బైర్‌‌‌‌ తనకొచ్చిన ఎఫ్‌‌డీఐల వివరాలను బయటపెట్టలేదు. లిటిల్‌‌ ఇంటర్నెట్‌‌  ఆర్‌‌‌‌బీఐ పెట్టిన ప్రైసింగ్ గైడ్‌‌లైన్స్‌‌ను ఫాలో కాకుండా ఎఫ్‌‌డీఐలు అందుకుంది.