
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు (mlc kavita)ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణ కోసం కవిత రేపు ఢిల్లీ రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. (delhi liquor scam)సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్లైని నిన్న ఈడీ అరెస్టు చేసింది. ఈడీ విచారణలో రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీనని ఒప్పుకున్నాడు. అంతకు ముందు సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులు చేరాయని ఈడీ ఆరోపించింది. (ED)
పిళ్లై విచారణలో.. కవిత, పిళ్లైల మధ్య లావాదేవీలు జరిగాయని ఈడీ గుర్తించింది. (arun pillai) పిళ్లై కవిత ప్రయోజనాల కోసం పనిచేశాడని ఈడీ విచారణలో తేల్చింది. దాంతో రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఈ విషయంపై రేపు విచారణకు రావాలని కవితను ఈడీ కోరింది. కవితతో పాటు మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. బుచ్చిబాబును విచారిస్తే తాను ఇచ్చే స్టేట్మెంట్ లో కీలక ఆధారాలు బయటపడతాయన్న ఈడీ.. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి, (ed)అభిషేక్, పిళ్లైతో సంబందాలపై ఆరా తీయనుంది. ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు. అయితే, రామచంద్ర పిళ్లై ఈ నెల 13 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నాడు. ఈడీ రేపు పిళ్లైతో కలిపి బుచ్చిబాబును విచారించే ఛాన్స్ ఉంది.