ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది.
కేటీఆర్ కు ఈడీ నోటీసులివ్వడం ఇది రెండోసారి. మొదటి సారి డిసెంబర్ 28న నోటీసులిచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే జనవరి 7న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా... హై కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉన్నందున విచారణకు సమయం కావాలని ఈడీకి మెయిల్ చేశారు కేటీఆర్.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్ట్
మరో వైపు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు జనవరి 7న కొట్టేసింది. కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఇచ్చిన స్టేను కూడా కొట్టేసింది. దీంతో కేటీఆర్ జనవరి 9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కేటీఆర్ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేస్తారా? సుప్రీంకు వెళ్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
55 కోట్ల అవకతవకలు
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ను ACB నమోదు చేసిన FIR ఆధారంగా PMLA చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించి .. FEO కు 55 కోట్లు నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఆర్థికపరమైన అవకతవలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ | కేటీఆర్ కేసులో బిగ్ ట్విస్ట్: సుప్రీంకోర్టులో ముందుగానే పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం