ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..కొద్దిసేపటి క్రితం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న 8 మంది ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను గురువారం( మార్చి 21) హైకోర్టు తిరస్కరించడంతో .. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కోర్టు ఆర్డర్స్ వచ్చి కొద్ది గంటల్లోను ఈడీ అధికారులు.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నక్రమంలో ఆయన ఇంటిదగ్గర, ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు.
ALSO READ :- ఈ ఐస్ క్రీం తినకపోతే ప్రోటీన్స్ కోల్పోతారు..
విషయం తెలిసిన వెంటనే.. ఆప్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్ ఇంటికి తరలి వస్తున్నారు. దీంతో కేజ్రీవాల్ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.