ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను మరింత వేగం పెంచారు అధికారులు. తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేశారు. ఈయన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూపు నుంచి అరుణ్ రామచంద్ర పిళ్లై మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వట్టినాగులపల్లిలో పిళ్లైకి చెందిన ల్యాండ్ ను, హైదరాబాద్ లో విల్లాను ఈడీ అధికారులు గతంలో అటాచ్ చేశారు.