
హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఈడీ సోదాలు చేశారు. హైదరాబాద్ నగరంలో మొత్తం 15చోట్ల సోదాలు నిర్వహించారు. గతంలో ఎన్నికల సమయంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు తాజాగా మరోసారి హైదరాబాద్ లో తనిఖీలు చేశారు.